TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాద్ షా మొదటివారం కలెక్షన్స్

Published on: Fri Apr 12, 2013 8:01PM

యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటించిన బాద్ షా సినిమా విడుదలయి అప్పుడే వారం రోజులు గడిచిపోయింది. అయినా ఇప్పటికీ సినిమాకి టికెట్స్ దొరకని పరిస్థితి. ఏ సినిమా హాలు ముందు చూసినా హౌస్ ఫుల్ బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. సినిమా టాక్ విని దియేటర్లకి వస్తున్న ఫామిలీ ఆడియన్స్ ని హౌస్ ఫుల్ బోర్డులు వెక్కిరిస్తుండటంతో కొంచెం అసహనంగా మరో సినిమాకి వెళ్ళక తప్పట్లేదు. ఈ ఊపు కనీసం మరో రెండువారాల వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని దియేటర్ల యజమానులు చెపుతున్నారు. మొదటి వారం కలెక్షన్ వివరాలు:

నైజాం

8.04 కోట్లు

సీడెడ్

5.45 కోట్లు

కృష్ణా

1.69 కోట్లు

గుంటూరు

2.70 కోట్లు

నెల్లూరు

1.13 కోట్లు

తూర్పు గోదావరి

1.81 కోట్లు

పశ్చిమ గోదావరి

1.51 కోట్లు

ఉత్తరాంధ్ర

2.43 కోట్లు

కర్ణాటక

2.75 కోట్లు

దేశంలో మిగిలిన ప్రాంతాలలో

0.70 కోట్లు

విదేశాలలో

5.90 కోట్లు

మొత్తం కలెక్షన్స్

34.11 కోట్లు