బూతు మాటలతో భయపెడుతున్న మంత్రి సుదర్శనరెడ్డి
Published on: Mon May 7, 2012 9:47AM
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై భారీనీటి పారుదల మంత్రిత్వ శాఖను చేపట్టిన టి.సుదర్శనరెడ్డికి అసహనం ఎక్కువ. సారా కాంట్రాక్టరుగా జీవనం ప్రారంభించి తరువాత హైదరాబాద్ సమీపాన డిస్టలరీని ఏర్పాటు చేసుకుని రాజకీయాల్లోకి వచ్చిన సుదర్శనరెడ్డికి కోపం కూడా ఎక్కువే. కార్యకర్తలకు, సామాన్య ప్రజానీకానికి ఎప్పుడూ దూరంగా ఉండే సుదర్శనరెడ్డి తనను ఎవరైనా ప్రశ్నిస్తే అసలు సహించరు. తాను చెప్పినదే వేదం, తాను చెప్పినదే వినాలన్న స్వభావం ఆయనది. ఇటీవల మంత్రిగారు ఒక బహిరంగసమావేశంలో మాట్లాడుతూ కొంతమంది కార్మి కులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. దీనితో మంత్రిగారి అనర్గళ ప్రసంగానికి అడ్డుకట్టపడింది. అంతే మంత్రిగారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
తన ప్రసంగానికి అడ్డుపడ్డారని థర్డ్ క్లాస్ ముండాకోడుకులు అంటూ అందరి ముందు తిట్టారు. చెప్పినది వినకపోతే బయటకు పోవాలన్నారు. అంతే తప్ప తన ముందు రాజకీయం చేస్తే సహించబోనని హెచ్చరించారు. గతేడాది ఆగస్టు 20న ఆందోళన చేస్తున్న వైద్యులపై తిట్లదండకాన్ని లంఘించుకున్నారు. వారిని గాడిదకొడుకులు అంటూ తిట్టారు. గతంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. మంత్రిగారి తీరుపై బాధితులు విమర్శలు చేస్తున్నా ఆయనేం పట్టించుకోవడం లేదు.


