TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్త ఇంట్లో పవన్ కి కష్టాలు తప్పవా?

Published on: Fri Jun 29, 2018 3:40PM

 

ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్, ప్రస్తుతం ప్రశ్నలు ఆపేసి ఎన్నికలు వైపు అడుగులు వేస్తున్నారు.. రాజధాని కేంద్రంగా రాజకీయాలు చేద్దామని డిసైడ్ అయిన పవన్.. ఇల్లు, పార్టీ ఆఫీస్ కోసం చౌక ధరకి స్థలం కూడా కొన్నారు.. అయితే నిర్మాణం ఆలస్యం అవుతుండటంతో, పార్టీ కార్యక్రమాలకు ఇబ్బంది కాకుండా అప్పటి వరకు విజయవాడలో ఓ ఇంటిని అద్దెకి తీసుకున్నారు.. ఇక నుండి పవన్ ఆ అద్దె ఇంటి నుండే పార్టీ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు.. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ఆ ఇంటి గతమే, పవన్ కి భవిష్యత్తులో కష్టాలు తప్పవని చెప్తుంది.

 ఆ ఇల్లు చూడటానికి బాగానే ఉంది కానీ వాస్తే బాలేదంట.. ఆ వాస్తు మూలంగా ఇంటి ఓనర్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడట.. వ్యాపారంలో భారీ నష్టం, కుటుంబంలో సమస్యలు ఇలా కష్టాలన్నీ చుట్టుముట్టాయట.. ఇంటికి దూరమైతే కానీ కష్టాలు దూరం అవ్వవని తెలుసుకున్న ఇంటి ఓనర్ వెంటనే ఇల్లు ఖాళీ చేసాడట.. ఇప్పుడిప్పుడే కష్టాలకు దూరంగా ప్రశాంతతకు దగ్గరగా బ్రతుకుతున్నాడు.. ఆ ఇంటి నుండి బయటపడిన ఓనర్ బానే ఉంటాడు మరి అద్దె ఇచ్చి ఇంట్లో దిగిన పవన్ పరిస్థితి ఏంటి? కష్టాలు తప్పవా?.. ఎవరైనా కష్టాలను కొని తెచ్చుకుంటారు.. పవన్ ఏంటి వెరైటీగా అద్దె కట్టి తెచ్చుకున్నాడు అంటూ ఛలోక్తులు వినిపిస్తున్నాయి.

ఫ్యాన్స్ కూడా అద్దె ఇంటి వాస్తు గురించి తెలిసి ఆందోళన చెందుతున్నారు.. ఓనర్ లాగా మా నాయకుడిగా కూడా కష్టాలు తప్పవా అంటూ బాధపడుతూన్నారట.. మరి పవన్ వరకు ఈ ఇంటి వాస్తు అంశం వెళ్లిందో లేదో.. పవన్ కి ఎవరైనా చెప్తే బాగుండు అనుకుంటున్నారు ఫ్యాన్స్.. చూద్దాం మరి పవన్ ఈ విషయం తెలిసి ఇల్లు ఖాళీ చేస్తారో? లేక ఇలాంటివి నమ్మను అంటూ ఆత్మ విశ్వాసంతో అలానే ఉంటారో.