TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రిఫరెండం పై వెనుకంజ వేస్తున్న పార్టీలు

Published on: Mon May 14, 2012 11:57AM

ఉప ఎన్నికల ప్రకటన ప్రారంభం నుంచి రిఫరెండం అన్న పదం రాష్ట్రంలో మారుమోగుతోంది. తమ పార్టీకి ఈ ఎన్నికలు రిఫరెండం కాదంటే తమకు కాదని పలు పార్టీలు ప్రకటన లిస్తున్నాయి. అసలు ఈ ఎన్నికలు ఎవరికీ రిఫరెండం అన్న విషయంలో ఓటరు అయోమయానికి గురయ్యే వాతావరణం నేడు నెలకొని ఉంది. తాము కొత్తగా పెట్టిన పార్టీ కాబట్టి తమకు ఈ ఎన్నికలు ఎంత మాత్రం రిఫరెండం కాదని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అంటోంది.

 

 

తెలంగాణా ప్రాంతాన్ని విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా పరిపాలించాలనే దృక్పథంలో తాము ప్రజల కోరిక మేరకు పార్టీగా ఏర్పడి పని చేస్తున్నందున ఈ ఎన్నికలు తమకూ రిఫరెండం కాదని టి.ఆర్.ఎస్. స్పష్టం చేస్తోంది. కేంద్రస్థాయిలో విస్తరించిన తాము కొత్తగా ఎన్నికల్లో దిగాట్లేదు కాబట్టి తమకూ ఈ ఎన్నికలు రిఫరెండం అవ్వవని భారతీయ జనతాపార్టీ (బిజెపి) చెప్పుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదరణ ఉన్న తమకు ఈ ఎన్నికలు అసలు రిఫరెండమే కాదని తెలుగుదేశం పార్టీ స్పస్తం చేస్తోంది. జాతీయ పార్టీ అయిన తమ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను రిఫరెండంగా భావించడం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ అంటున్నారు. ఈయన గత మూడు, నాలుగు రోజులుగా ఇదే విషయాన్ని మూడు, నాలుగు జిల్లాల్లో ప్రస్తావించారు.

 

అయితే ఈ ఎన్నికలు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి రిఫరెండం అని టి.ఆర్.ఎస్. పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి అంటున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఈ ఇద్దరూ తెరమరుగు అవటం ఖాయమని ఆయన జోస్యం చెబుతున్నారు. ప్రత్యేకించి వీరిద్దరికే రిఫరెండం అవుతుందని వ్యాఖ్యానించిన జితేంద్ర తమ పార్టీలో ఎవరికీ ఈ ఎన్నికలు రిఫరెండమో మాత్రం చెప్పలేదు. ఐకాస జెఎసి చైర్మన్ కోదండరామ్ ను వ్యతిరేకిస్తున్న టి.ఆర్.ఎస్. అధినేత చంద్రశేఖర రావుకు తెలంగాణలో ఈ ఎన్నికలు రిఫరెండం ఎందుకు అనకూదదో చెప్పాలని ఆయన ప్రత్యర్థులు కోరుతున్నారు.