దేశభక్తి పూరితం ‘బేబీ’... మూవీ రివ్యూ
Published on: Fri Jan 23, 2015 2:32PM

అక్షయ్ కుమార్ నటించిన థ్రిల్లర్ మూవీ ‘బేబీ’ శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తారాగణం: అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, అనుపమ్ ఖేర్, డానీ డెంజోప్పా, కేకే మీనన్, దర్శకత్వం: నీరజ్ పాండే. ‘బేబీ’ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా రూపొందించిన సినిమా. పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాదులు భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ‘ఆపరేషన్ బేబీ’ అనే పన్నాగం పన్నినప్పుడు దానిని కథానాయకుడు ఏ విధంగా భగ్నం చేశాడన్నది ఈ సినిమా కథాంశం. ఈమధ్యకాలంలో కామెడీ పాత్రలు ధరించిన అక్షయ్ కుమార్ ఈ సినిమాలో సీరియస్‌గా వుండే పాత్ర ధరించాడు. దేశభక్తి పూరితంగా ఈ సినిమా వుంది.


