పాపకి జన్మనిచ్చిన నమ్రతామహేష్‌బాబు
Published on: Fri Jul 20, 2012 2:06PM
సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్‌బాబు, నమ్రతాలు మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ రోజు ఉదయం 8:10 గంటలకు సోమాజీగూడ లోని స్నేహా ఆస్పత్రిలో మహేష్ సతీమణి నమ్రతా ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ పాప మహేష్‌బాబుకు రెండో సంతానం. ఆయనకు ఇప్పటికే గౌతమ్ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. మహేష్, అతిని పెద్ద కుమారుడు గౌతమ్ నమ్రతాతోనే ఉన్నారని సన్నిహితుల నుంచి అందిన సమాచారం. పాప మొదటి శ్రావణ శుక్రవారం సింహరాశిలో జన్మించడం విశేషం.


