TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వ్యవసాయంపై చంద్రబాబు శ్వేతపత్ర౦

Published on: Wed Jul 23, 2014 5:02PM

వివిధ రంగాల్లో వైఫల్యాలు..తన హాయంలో పనితీరును చూపుతూ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు మరో శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈసారి వ్యవసాయం, ఇరిగేషన్ శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఏపీ రాష్ట్ర వ్యవసాయ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయా శాఖలపై సమీక్ష నిర్వహించారు. శ్వేతపత్రాల విడుదలపై రెండు శాఖల అధికారులతో చర్చించారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.