జగన్‌కి చంద్రబాబు ఫోన్, ఆహ్వానం!
Published on: Fri Jun 6, 2014 6:22PM
.jpg)
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆదివారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాలని చంద్రబాబు జగన్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు నాయుడిని వైయస్ జగన్ అభినందించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే విషయాన్ని పార్టీలో చర్చించిన తర్వాత జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.


