TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ మంత్రి నారాయణ అరెస్టు కక్ష పూరితం: చంద్రబాబు

Published on: Tue May 10, 2022 4:07PM

మాజీ మంత్రి నారాయణ అరెస్టు కక్షపూరితమని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తమ వైఫల్యానికి కప్పి పుచ్చుకునేందుకే మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల నిర్వహణలో విఫలం అయిన ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత, విమర్శలను ఎదుర్కొన్న జగన్ సర్కార్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేసి  దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నదన్నారు.  

అసలు పేపర్ లీక్ అనేదే  లేదంటూ మంత్రి బొత్స ప్రకటన చెయ్యలేదా అన్నారు . మాస్ కాపీయింగ్ కు, పరీక్ష ల నిర్వహణలో వైఫల్యాలకు... నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని ప్రశ్నించారు. కాగా నారాయణ అరెస్టు సమయంలో ఆయన  త‌న కుమారుడు నితీశ్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మంలో ఉన్నారు. హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో కుమారుడు నితీశ్ వ‌ర్థంతికి నితీత్ వర్ధంతి కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఏపీ సీఐడీ పోలీసులు నారాయ‌ణను అరెస్టు చేశారు.

2017 మే 10 తెల్లవారుజామున హైద‌రాబాద్‌లోని మాదాపూర్ ప‌రిధిలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో నితీశ్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే.  కుమారుడి వర్థంతి కార్యక్రమంలో ఉన్న మాజీ మంత్రిని అరెస్టు చేయడం కక్షపూరితం కాకమరేమిటని తెదేపా నాయకులు విమర్శిస్తున్నారు.