TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముగ్గురు అక్క‌చెల్లెళ్లు.. పుట్టిన తేదీ ఆగ‌స్టు 25!

Published on: Wed Jul 13, 2022 9:03PM

పూర్వం క‌వ‌ల పిల్ల‌ల్ని చూసి ఆశ్చ‌ర్య‌ప‌డేవారు, ఆ త‌ర్వాత ఒకేలా వ్య‌వ‌హ‌రించే పిల్ల‌ల్ని చూసి ఆశ్చ‌ర్య‌ప‌డేవారు, మ‌నిషిని పోలిన మ‌నుషులు లోకంలో ఏడుగురు వుంటార‌ని ఓ చిత్ర‌మైన సిద్ధాంతం చాలా ప్ర‌చారంలో వుంది. ప్లారిడాకు చెందిన క్రిస్టిన్ లామ‌ర్ట్ ఆనందం మ‌రో ర‌కం. ఆమెకు ముగ్గురు పిల్ల‌లూ మూడేళ్ల తేడాతో జ‌న్మించారు.. అదీ  ఒకే తేదీన‌!

త‌న ముగ్గురు పిల్ల‌లు సోఫియా, గ్యులియానా, మియాలు ఆగ‌స్టు 25నే పుట్ట‌డం చిత్రంగా వుంద‌ని, దైవ కృప‌గా భావిస్తున్నాన‌ని అన్న‌ది త‌ల్లి క్రిస్టిన్‌. ఆమే కాదు చుట్టుపక్క‌ల‌వారూ ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌డుతున్నారు. ఇదెలా సాధ్యం?.. ప్ర‌తీవారూ వేసుకుంటున్న ప్ర‌శ్న‌. ఆరేళ్ల సోఫియా 2015 ఆగ‌స్టు 25న పుట్టింది. మూడేళ్ల గ్యులియానా 2018లో అదే తేదీన పుట్టింది.  చిన్నారి  మియా 2021 లో అదే తేదీన జ‌న్మించింది! అంటే ఆగ‌స్టు 25వ తేదీ ఆ యింట, ఆ వీధి వీధంతా  పుట్టిన‌రోజు పండ‌గే.. ప్ర‌తీ సంవ‌త్స‌రం!

పెద్ద పిల్ల సోఫియాని క‌డుపుతో వున్న‌పుడు త‌న‌కు ఆగ‌స్టు 23న బిడ్డ పుట్ట‌వ‌చ్చ‌ని డాక్ట‌ర్లు క్రిస్టిన్ తో అన్నారు. కానీ సోఫియా 25వ తేదీన పుట్టింది. రెండో బిడ్డ స‌మ‌యంలో డాక్ట‌ర్లు చెప్పిన‌ట్టే జ‌రుగుతుంద‌ని ఆశించింది. కానీ చాలా చిత్రంగా ఆగ‌స్టు 25నే జ‌న్మించి డాక్ట‌ర్ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.