TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జేఎన్‌యూలో రాందేవ్‌బాబా శిబిరం

Published on: Wed Mar 9, 2016 3:33PM

 

దేశంలోని వార్తల్లో సగం జేఎన్‌యూ చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో తనెందుకు వెనుకబడి ఉండాలనుకున్నారో ఏమో... యోగా గురువు రాందేవ్‌ బాబాగారు కూడా జేఎన్‌యూకి బయల్దేరుతున్నారట. అక్కడి విద్యార్థులకు యోగాలో శిక్షణని అందించేదుకు ఓ శిబిరాన్ని నిర్వహించేందుకు రాందేవ్‌గారు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారట. ఇంతకుముందు ఇలాగే ఓసారి రాందేవ్‌గారు విశ్వవిద్యాలయంలోకి వెళ్లేందుకు సిద్ధపడుతుండగా వామపక్ష విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి.

కానీ మారిన పరిస్థితులలో, రాందేవ్‌ను మరోసారి అడ్డుకుంటే ఇబ్బందులు తప్పవని సదరు సంఘాలు గ్రహించినట్లున్నాయి. అందుకే ఈసారి ఏ సంఘమూ చప్పుడు చేయడం లేదు. పైగా భాజపా అనుకూల విద్యార్థి సంఘమైన ఏబీవీపీ రాందేవ్‌గారి రాకకోసం  ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఫిబ్రవరి 9న తీవ్రవాది అఫ్జల్‌గురుకు అనుకూలంగా వివాదాస్పద సమావేశం జరిగిన తరువాత, ఇలాంటి యోగా కార్యక్రమం జరగడం ఒక మంచి మార్పుకి సూచనగా సదరు ఏబీవీపీ నేతలు భావిస్తున్నారు. మరి రాందేవ్‌గారి శిబిరం ఎప్పుడు మొదలవుతుందో, అందులో ఆయన ఏం వ్యాఖ్యానిస్తారో చూడాలి!