TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్టీఆర్ 'బాద్ షా' ఆడియో వాయిదా

Published on: Thu Mar 7, 2013 10:02AM

 

 

Baadshah audio launch postponed, Baadshah audio release, Baadshah audio songs

 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'బాద్ షా' ఆడియోను ఈ నెల 10న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆడియో ఫంక్షన్ వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. శివరాత్రి సంధర్బంగా తమ ఇష్ట దైవం మహా శివుడి పేరు గల 'పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్' ప్రతిష్టాత్మక చిత్రం 'బాద్ షా' ఆడియోను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని అనుకున్నారు.

 

ఇదే రోజున శివరాత్రి కావడంతో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దేవాలయాలకు సెక్యూరిటీ భారీగా ఇవ్వాలని కనుక 'బాద్ షా' ఆడియో కు సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉంటుంది. ఈ నేపధ్యంలో డీజీపి ఫంక్షన్ ను వాయిదా వేయాలని ప్రొడ్యూసర్ ని రిక్వెస్ట్ చేయడంతో వాయిదా వేశారని తెలుస్తోంది. ఈ నెల 17న ఆడియో రిలీజ్ చేయనున్నారని సమాచారం.