TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

గూగుల్ ని నమ్ముకున్న..  బీటెక్ విద్యార్థుల మోసం.. 

Published on: Wed Jun 23, 2021 1:30PM

నేటి సమాజంలో పాలు తాగే పిల్లవాడి నుండి, పప్పు అన్నం తింటూ ఒంట్లో కూర్చున్న రిటైడ్ అయినా వ్యక్తుల వరకు, అలాగే  ఓనలమా నుండి ఒంట్లు నేర్చుకునే, అంట్లు తోముకునే అమ్మాయిల దాకా, ఫేక్ బుక్ అకౌంట్ నుండి  అలెక్స దాకా మనిషికి ఏ డౌట్ వచ్చిన ఇమీడియేట్ గా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.. అందుకే కొంత మంది ప్రజలు గూగుల్ ని గూగుల్ తల్లీ అంటారు.. ఒక రకంగా చెప్పాలంటే గూగుల్ మానవాళికి ఎన్ సైక్లోపీడియా అని చెప్పవచ్చు. అలాగే మనుషులు గూగుల్ మీద ఆధారపడుతున్నారు. గూగుల్ లేని జీవితం గుడ్డిదైతున్నట్లు ప్రవర్తిస్తున్నారు.. ఒకరకంగా కొంత మంది యువత  గూగుల్ ని తన భవిష్యత్తు కోసం ఉపయోగించుకుంటుంటే మరికొంత మంది అదే గూగుల్ ను జీవితాలు నాశనం చేసుకోవడానికి వాడుతున్నారు. ఇంకొంత మంది ప్రజలను మోసం చేయడానికి వాడుతున్నారు. తాజాగా కొంత మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరిట ఫ్రాడ్ చేస్తున్నారు. ఉద్యోగం కోసం  గూగుల్ లో  సెర్చ్ చేసిన బీటెక్ స్టూడెంట్స్‌ ను మోసం చేశారు. ఆ మోసం ఎందుకు ఎలా జరిగిందని తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త చావాల్సిందే.. ఎప్పుడైనా ఎలాంటి సందర్భం వచ్చిన మీరు కూడా మోసపోకుండా ఉన్నారు. 

వివ‌రాల్లోకి వెళితే.. కొంద‌రు విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గూగుల్‌లో శోధించారు, గూగుల్ తల్లిని నమ్ముకున్నారు . ఇక అంటే  దీంతో వీరికి గూగుల్‌లో ఓ నెంబ‌ర్ దొరికింది. స‌ద‌రు వ్య‌క్తి తాను సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ అని విద్యార్థుల‌కు ప‌రిచ‌యం చేసుకున్నాడు. మాదాపూర్‌లో కొత్త‌గా లిమిటెక్స్ కంపెనీని ప్రారంభించాని తెలిపిన ఆ వ్య‌క్తి.. విద్యార్థులను రెజ్యూమ్‌లు పంప‌మ‌ని వారిని న‌మ్మించాడు. కొత్త నాటకం మొదలు పెట్టి ఒక్కొక్కరిని ఎంచుకున్నాడు. అసలే కరోనా టైం చేద్దామంటే పని లేదు. ఉన్న ఉద్యోగాలకు భరోసా లేదు. కష్టకాలంలో ఉంద్యోగం వస్తుందని ఆశపడ్డారు. ఇలా ఆయ‌నకు ఏకంగా 35 నుంచి 40 మంది రెజ్యూమ్‌ల‌ను పంపించారు. ఇక స‌ద‌రు ప్ర‌బుద్ధుడు త‌న యాక్ష‌న్ ప్లాన్‌ను ప్రారంభించాడు. ఉద్యోగంలో చేరాలంటే ముందుగా డబ్బులు చెల్లించాల‌ని తెలిపాడు. దీంతో వెన‌కాముందు ఆలోచించ‌ని విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా డ‌బ్బులు పంపించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మొత్తం రూ.27 ల‌క్ష‌ల‌కుపైగా పంపించారు. అనంత‌రం ఫోన్ చేయ‌డంతో స‌ద‌రు వ్య‌క్తి ఫోన్ స్విచ్ఛాఫ్ వ‌చ్చింది. దీంతో వారిలో ఒక‌రైన అల్వాల్‌కు చెందిన బుచ్చి రాములు అనే వ్య‌క్తి సోమ‌వారం సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అంత‌టితో ఆగ‌కుండా త‌న‌లా ఎవ‌రైనా.. మోస‌పోయారేమోన‌ని ఆన్‌లైన్‌లో వెతికాడు. దీంతో దాదాపు 40 మంది తాము కూడా మోస‌పోయామ‌ని బుచ్చిబాబును కాంటాక్ట్ అయ్యారు. దీంతో వీరంతా క‌లిసి మంగ‌ళ‌వారం.. నేరుగా సైబ‌ర్ క్రైం పోలీసుల్ని క‌లిసి ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తును మొద‌లు పెట్టారు.