TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అజారుద్దీన్ ఘన విజయం

Published on: Fri Sep 27, 2019 4:54PM

 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు ముగిశాయి. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఘన విజయం సాధించారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ పదవి కోసం అజారుద్దీన్ పాటు ప్రకాశ్ చంద్ జైన్, దిలీప్ కుమార్ బరిలో దిగారు. మొత్తం ఓట్లు 227 కాగా, 223 ఓట్లు పోలయ్యాయి. అజారుద్దీన్ కు 147, ప్రకాశ్ జైన్ కు 73, దిలీప్ కుమార్ కు 3 ఓట్లు లభించాయి. దీంతో అజారుద్దీన్ హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ కి పలువురు అభినందనలు తెలిపారు. అజారుద్దీన్ అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు.