TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అజారుద్దీన్ .. ఎమ్మెల్యే ఇన్నింగ్స్‌.. అడ్డుగా మాజీ..?

Published on: Fri Aug 11, 2023 11:12AM

మొన్నటి భారత్ జోడో యాత్ర.. నిన్నటి కర్ణాటక గెలుపు.. మొత్తం మీద యమ బోరుగా ఉన్న కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణను టార్గెట్ చేసింది.
ఈ సమయంలో చేరికలతో, సరికొత్త ఎత్తులతో సందడి చేస్తోంది. ఈ సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఎంటరయ్యాడు. అసెంబ్లీకి పోటీ  చేసి..ఎమ్మెల్యే అయ్యేందుకు తహ తహ లాడుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ వచ్చే ఎన్నికలల్లో చక్కని ఇన్నింగ్స్‌ కోసం కలలు కంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. దీంతో ఒక నియోజకవర్గాన్ని కూడా ఎంపిక చేసుకున్నాడాయన. దీంతో స్థానిక నేత అనుచరులు ఆందోళనలకు దిగి తున్నారు.
పార్లమెంట్ సభ్యునుగా అజారుద్దీన్ 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున  ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతగా అసెంబ్లీకి ఎన్నిక కావాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా... జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని తనకు తానుగా ప్రకటించుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి వెళ్లిన అజారుద్దీన్ కు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా నియోజకవర్గానికి వెళ్లిన ఆయన... నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ప్రజలు కొత్త ముఖాన్ని కోరుకుంటున్నారంటూ ప్రకటన చేశారు. ఈ ప్రకటనే వివాదానికి కారణమైంది.

దీంతో... పీ.జనార్థన రెడ్డి తనయుడయ.. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి మద్దతుదారుల నుంచి నిరసన వ్యక్తం అయింది. జూబ్లీహిల్స్‌ తో తనకు 16 ఏళ్ల అనుబంధం ఉందని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి చెబుతున్నారు. ఫలితంగా... విష్ణు మద్దతు దారులు అజాహరుద్దీన్ పర్యటనకు అభ్యంతరం చెప్పారు. పైగా... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ పై జూబ్లిహిల్స్ నుంచి పోటీచేసి గెలవాలని విష్ణువర్దన్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే పీసీసీ పెద్దలతో మంతనాలు జరిపారని అంటున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో గతకొంతకాలంగా చురుకుగా ఉన్నారు.

సరిగ్గా ఈ సమయంలో అజారుద్దీన్ ఎంటరయ్యారు. తాజాగా నియోజకవర్గ పరిధిలోని సోమాజీ గూడ, ఎర్రగడ్డ, బోరుబండ ప్రాంతాల్లో పర్యటించారు. పార్టీ కేడర్ తో కలిసి ఛాయ్ పే చర్చ నిర్వహించారు. స్థానికులతోనూ మమేకమయ్యే ప్రయత్నం చేసారు. దీంతో విష్ణు వర్గీయులు అజార్దుద్దీన్ పై ఫైరవుతున్నారు. అయితే.. అజాహరుద్దీన్ ను సికింద్రాబాద్ ఎంపీగా బరిలోకి దింపాలని మరి కొందరు నేతలు సూచిస్తున్నారు. విష్ణు అనుచరులు మాత్రం ఏంటి పరిస్థితి   అంటూ తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది. మరి ఈ సమయంలో అధిష్టానం పెద్దలు అజారుద్దీన్ ని ఒప్పిస్తారా.. లేక, విష్ణుని పక్కన పెడతారా..అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అవుతోందా..?