TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బుజ్జగించిన ఆజాద్..డీఎల్ ససేమిరా

Published on: Wed Feb 8, 2012 10:00AM

హైదరాబాద్: తన శాఖలో కోత విధించడంతో అసంతృప్తితో ఉన్న ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి రాజీనామాకు సిద్ధపడడంతో అధిష్టానం బుజ్జగించటం మొదలుపెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ మంత్రి డీఎల్కు  బుధవారం పలుమార్లు ఫోన్ చేసి రాజీనామా పై తొందరపడవద్దని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే డిఎల్ మాత్రం ససేమీరా అంటున్నారని సమాచారం. తాను తన శాఖను ఎప్పుడు సమర్థవంతంగా నిర్వహించలేదో చెప్పాలని ఆయన సిఎం కిరణ్‌ను ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం ఎంతగా చెప్పినప్పటికీ ఆయన మాత్రం రాజీనామాకు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ తనను టార్గెట్ చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన మరికాసేపట్లో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను కలవనున్నారు. శాఖల తొలగింపు, మార్పులు ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా జరుగుతుందని డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. ఏ శాఖ ఇచ్చినా తనకు సమర్థవంతంగా నిర్వహించే శక్తి ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని నడిపేది కాంగ్రెసు పార్టీ కాదని, డబ్బులున్న వ్యక్తులని ఆరోపించారు. కాగా మంగళవారం ఉదయమే ఆయన శాఖల కత్తిరింపు మీద ముఖ్యమంత్రిపై తన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న డిఎల్ రాత్రి కడప నుండి హైదరాబాద్ వచ్చారు.