కవితమ్మా ఎక్కడున్నవమ్మా..!!

 

 

 

మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతున్నాయి. ఆ కట్టడాలను కూల్చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్ర శేఖరరావుపైన బాధితులు మండిపడుతున్నారు. ఆయనతోపాటు పనిలో పనిగా ఆయన కూతురు నిజామాబాద్ ఎంపీ కవితపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు తప్పుగా కనిపించిన పని తన తండ్రి ముఖ్యమంత్రి అయ్యేసరికి ఒప్పయిపోయిందా అని భాదితులు నిలదీస్తున్నారు.

 

ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే...2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు ఇదే అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం చెప్పట్టారు. అప్పుడు కేసిఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వెంటనే ఘటన స్థలానికి వచ్చి..రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లజోలికి పోకుండా బడుగుల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆందోళనకు దీగారు. చివరకు అరెస్ట్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. అప్పుడు అంత హడావుడి చేసిన కవిత ఇప్పుడు నోరు మెదపకపోవడంపై వారి మండిపడుతున్నారు. గతంలో ఇళ్లుకూల్చవద్దని అడ్డుకున్న కవితమ్మ ఇప్పుడు ఎందుకు అడ్డుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు?