TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రామమందిరంపై సుప్రీంకోర్టు... మీరే తేల్చుకోండి.

Published on: Tue Mar 21, 2017 12:54PM

 

అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అయోధ్యలోని రామమందిరాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. రామ‌మందిర నిర్మాణం మనోభావాలకు, మ‌తానికి సంబంధించిన అంశ‌మ‌ని.. రామ‌జ‌న్మ భూమి- బాబ్రీ మ‌సీదు అంశంపై రెండు వ‌ర్గాలు కోర్టు బ‌య‌ట చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని చీఫ్ జ‌స్టిస్ జేఎస్ ఖేహ‌ర్ సూచించారు. రెండు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగే చ‌ర్చ‌ల ద్వారా ఒక‌వేళ స‌మస్య ప‌రిష్కారం కాని ప‌క్షంలో మాత్ర‌మే తాము ఆ కేసును డీల్ చేయ‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. అంతేకాదు.. ఒక‌వేళ రెండు వ‌ర్గాలు చ‌ర్చ‌ల కోసం మ‌ధ్య‌వ‌ర్తి కావాలంటే దానికి కోర్టు ఏర్పాట్లు చేస్తుంద‌ని కూడా తెలిపింది. ఇక సుప్రీం చేసిన సూచనకు స్పందించిన స్వామి.. రెండు వ‌ర్గాల‌ను చ‌ర్చ‌కు ఆహ్వానించ‌డం క‌ష్ట‌మైన అంశ‌మ‌ని, కేవ‌లం న్యాయ ప్ర‌క్రియ ద్వారానే దీన్ని ప‌రిష్క‌రించాల‌ని కోర్టును కోరారు. అయితే మార్చి 31న మ‌ళ్లీ ఈ కేసుపై విచార‌ణ‌కు రావాల‌ని కోర్టు సుబ్ర‌మ‌ణ్య‌స్వామికి ఆదేశాలు జారీ చేసింది.