TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ వాయిదా

Published on: Thu Jun 18, 2020 5:24PM

భారత్, చైనా సరిహద్దు వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిర్వహించ తలపెట్టిన భూమి పూజ కార్యక్రమం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూలై 1న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయాల్సి ఉంది. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని అంతా అనుకున్నారు. అయితే, భారత్- చైనా సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. భూమి పూజ వాయిదా పడింది. కొత్త తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియాల్సి ఉంది.