దేశంలోనే అతి చిన్న రచయిత ఎవరో తెలుసా!

posted on: Jun 6, 2018 11:56AM

 

అయన్‌ గొగోయ్ అసోంకి చెందిన ఓ పిల్లవాడు. గొగోయ్ ఏడాది నుంచే ఏవో ఒక బొమ్మలు గీసేవాడు. కానీ పాపం మాటలు మాత్రం వచ్చేవి కావు. ఏడాది తర్వాత ఏడాది అలా మూడేళ్లు గడిచిపోయాయి. ప్చ్‌... గొగోయ్‌కి మాటలు రాలేదు. అతనిలో ఏదో లోపం ఉందని తల్లిదండ్రులు భయపడుతూ ఉండగా... అకస్మాత్తుగా తన నాలుగో ఏట నుంచి అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అంతేకాదు! టీవీ సీరియల్స్ చూసి సొంతగా ఇంగ్లిష్‌లోనూ మాట్లాడసాగాడు. అతని నైపుణ్యాన్ని గమనించిన తల్లి మాటల్ని అక్షరాలలోకి మార్చే ఒక యాప్‌ను ఇచ్చింది. ఆ యాప్‌తో గొగోయ్ ఏకంగా ఓ 80 పేజీల పుస్తకమే రాసేశాడు. ఆ పుస్తకంలో చిన్న చిన్న కథలు ఉంటాయి. ఆ కథలకి బొమ్మలు కూడా తనే గీయడం మరో విశేషం. గొగోయ్‌ ప్రతిభను గమనించిన ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ అనే సంస్థ దేశంలోనే అతి చిన్న రచయితగా బిరుదుని అందించేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...