Latest News

లక్ష్మీగా మారిన అవికా

posted on: Feb 20, 2014 1:15PM

 

"ఉయ్యాలా జంపాలా" చిత్రంతో హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమైన అవికా ఘోర్ ప్రస్తుతం మరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. "లక్ష్మీ రావే మా ఇంటికి" అనేది చిత్ర టైటిల్. ఈ చిత్రం ద్వారా ప్రముఖ రచయిత నంద్యాల రవి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈరోజు ఉదయం ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు జరుపుకుంది. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...