TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతిలో భక్తులను నిలువుదోపిడీ చేస్తున్న ఆటోవాలాలు.. మితిమీరిన వేగంతో ప్రమాదాలు

Published on: Tue Apr 22, 2025 8:09AM

ఓ వైపు తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మరో వైపు శ్రీవారి మెట్ల నడకమార్గంలో భక్తులు పొటెత్తుతున్నారు. ఇదే అదునుగా భక్తులను ఆటోవాలాలు నిలువుదోపిడీ చేస్తున్నారు. తిరుపతి బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్లు వరకూ కేవలం 20 కిలోమీటర్ల దూరానికి పెద్ద మొత్తంలో సొమ్ములు దండుకుంటున్నారు. టైమ్ స్టాట్

టోకెన్లు తీయిస్తామంటూ భక్తుల నుంచి అదనంగా సొమ్ములు వసూలు చేస్తున్నారు.  వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు.ఇదే అదునుగా ఒక్కో ఆటోలో పరిమితికి మించి భక్తులను తరలిస్తూ ఆటోవాలాలు ప్రమాదాలకు కారణమౌతున్నారు. సోమవారం (ఏప్రిల్ 21) ఎనిమిది మంది భక్తులను అలిపిరి బస్టాండ్ నుంచి శ్రీవారి భక్తులతో వస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది.

ఆ ఆటోవాలా కేవలం 20 కిలోమీటర్ల దూరానికి ఆ ఎనిమిది మంది భక్తులకూ కలిసి నాలుగువేల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అతి వేగంగా ఆటో నడుపుతూ భక్తుల నుంచి ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి జీపును ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న భక్తులు గాయపడ్డారు. వారిలో బెంగళూరుకు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోవాలాల దోపిడీని పోలీసులు నియంత్రించాల్సిన అవసరం ఉందనీ, అలాగే పరిమితిని మించిన ప్రయాణీలతో, మితిమీరిన వేగంతో వెళ్లే ఆటో డ్రైవర్ల మీద చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.