మహిళల టీ20 వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా.. ఏడోసారి విశ్వవిజేతగా సరికొత్త రికార్డు!
Published on: Mon Jul 6, 2026 10:26AM

మహిళల క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. మహిళల టి20 వరల్డ్ కప్ విజేతగా నిలవడం ఆస్ట్రేలియాకు ఇదే ఏడోసారి.
ఆదివారం (జులై5) జరిగిన ఫైనల్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. వీరిద్దరూ అజేయంగా ఐదో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఓపెనర్ బెత్ మూనీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చింది. కేవలం 49 బంతుల్లో 64 పరుగులు చేసి జట్టు విజయానికి గట్టి పునాది వేసింది. అలాగే వన్‌డౌన్ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ సైతం 35 బంతుల్లోనే 48 పరుగులు చేయడంతో ఆసీస్ విజయాన్ని లాంఛనం చేసేసింది. చివరకు ఆస్ట్రేలియా కేవలం 17.1 ఓశర్లలోనూ మూడు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Australia Women Cricket Team, Beth Mooney Half Century, Australia Seventh T20 Title, Nat Sciver Brunt


