షాపింగ్‌మాల్‌పై కూలిన విమానం...ఐదుగురు దుర్మరణం

ఆస్ట్రేలియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఐదుగురు ప్రయాణికులతో మెల్‌బోర్న్ నుంచి టాస్మేనియా వెళ్తున్న ఛార్టర్డ్ ఫ్లైట్ ఈ ఉదయం తెల్లవారు జామున ఎస్సెన్‌డన్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో సమీపంలోని షాపింగ్‌మాల్‌పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో షాపింగ్ మాల్ మొత్తం ధ్వంసమవ్వగా..విమానం పేలిపోయింది..దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. విమానం గాలిలో చక్కర్లు కొడుతూ షాపింగ్‌మాల్‌పై కూలిపోయే దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో నెటిజన్లు వాటిని ఆసక్తికరంగా వీక్షిస్తున్నారు. కాగా, మరణించిన ప్రయాణికులు ఏ దేశ వాసులో ఇంకా తెలియరాలేదు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు విమానశకలాలను వెలికితీసే పనులను ప్రారంభించాయి.