ఉప్పల్ టెస్ట్: ఇన్నింగ్స్ ఓటమి దిశగా ఆసీస్

Publish Date:Mar 5, 2013

 

 

australia, india, second test australia

 

 

హైదరాబాద్ ఉప్పల్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. 74పరుగులకి 2 వికెట్ల నష్టంతో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే వాట్సన్ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన బాట్స్ మెన్ లెవ్వరు క్రీజులో నిలువలేకపోయారు. మైఖెల్ క్లార్క్ 16 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో అవుటయ్యాడు. డేవిడ్ వార్నర్ 26, గ్లెన్ మాక్స్‌వెల్ 8ను అశ్విన్ అవుట్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 130/7 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంది. ఆసీస్ ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే ఇంకా 136 పరుగులు చేయాల్సి ఉంది.