TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విమానం హైజాక్ యత్నం?

Published on: Mon Sep 22, 2025 3:04PM

ఎయిర్ ఇండియా విమానాలలో ఇటీవలి కాలంలో తరచూ ఏదో ఒక లోపం బయటపడుతోంది. సాంకేతిక లోపాలతో పాటు భద్రతాపరమైన లొసుగులు కూడా ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా బెంగళూరు నుంచి వారణాసి వెడుతున్న ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన సంఘటన ఈ విమానం హైజాక్ కు ప్రయత్నం జరిగిందా అన్న అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ విషయంపై ఎయిర్ ఇండియా నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా రానప్పటికీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ విమానంలో ఒక ప్రయాణీకులు పైలట్ కాక్ పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు.

అందుకు అవసరమైన పాస్ వర్డ్ ను కూడా యాక్యురేట్ గా ఎంటర్ చేశాడు. అయితే అనుమానంతో పైలట్ డోర్ తెరవడానికి అంగీకరించకపోవడంతో అతడి ప్రయాణం విఫలమైంది. అత్యంత రహస్యంగా ఉండే పాస్ వర్డ్ ఆ ప్రయాణీకుడికి ఎలా తెలిసిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతే కాకుండా ఆ ప్రయాణీకుడు ఎనిమిదది మందితో కలిసి ఆ విమానంలో ప్రయాణిస్తున్నాడు. దీంతో కాక్ పిట్ డోర్ తెరవడానికి చేసిన ప్రయత్నం హైజాక్ యత్నమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విమానం వారణాసిలో ల్యాండ్ కాగానే ఆ ఎనిమిది మంది ప్రయాణీకులను అదుపులోనికి తీసుకుని సీఐఎస్ఎఫ్ కు అప్పగించారు. సీఐఎస్ఎఫ్ అధికారులు వారిని విచారిస్తున్నారు.