అ౦గట్లో 'అత్తారింటికి దారేది'
Published on: Tue Sep 24, 2013 12:51PM
.jpg)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమా విడుదల కాకముందే పైరసీకి గురికావడంపై చిత్రపరిశ్రమ షాక్ కి గురైంది. దీనిపై ఫిలించాంబర్ ఆగమేఘాల మీద స్పందించి నెట్‌లో ఈ సినిమా లింకులను తొలగించేలా చేయడంతో పాటు.. ఈ సినిమా సీడీల విక్రయం గురించి ఎవరికి తెలిసినా తమకు తెలియజేయాలంటూ ఒక ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ ఇచ్చింది.
అయితే దాదాపు 90 నిమిషాల నిడివిగల విజువల్స్ నెట్‌లో ఎలా లీకయ్యాయి? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? ఇది బయటివాళ్లెవరైనా కావాలని చేశారా? లేక.. యూనిట్ సిబ్బందిలోనే ఎవరో ఒకరు ఇంత సంచలనానికి కారణమయ్యారా? అనేది ఇప్పటికి తెలియలేదు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కొందరు రివర్స్‌ట్రాకింగ్ పద్ధతిలో ఈ వీడియోను తొలిసారిగా ఎక్కడ ఎవరు అప్‌లోడ్ చేశారో కనుక్కునే ప్రయత్నం చేశారు. ఇది క్యాలిఫోర్నియా ఫ్రీమాంట్ ప్రాంతానికి చెందిన ఐపీ అడ్రస్ నుంచి అది అప్‌లోడ్ అయిందని తెలిసింది. ఇప్పటికే పైరసీ రాకాసితో బెంబేలెత్తిపోతున్న దర్శక, నిర్మాతలు ఈతరహా చర్యలతో పూర్తిగా కుదేలైపోవడం ఖాయం.


