అత్తారింటికి రామయ్యా సందడి
posted on: Sep 27, 2013 11:20AM

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం అందరికి తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలయిన ఈ చిత్రానికి పవన్ అభిమానులతో పాటుగా ఎన్టీఆర్ అభిమానులు కూడా సందడి చేయనున్నారు. ఎందుకంటే ఈ చిత్రం ఇంటర్వెల్ సమయంలో ఎన్టీఆర్ నటించిన "రామయ్యా వస్తావయ్యా" చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించనున్నారట. అంతే కాకుండా ఇటీవలే పవన్ సినిమా పైరసీకి గురైనప్పుడు.. ఎన్టీఆర్ ఈ సినిమాకు మద్దతు తెలిపాడు. అందువల్ల ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. అసలే వాయిదాలు పడి పడి విడుదలయిన ఈ చిత్రానికి తెలుగు అభిమానుల సందడితో రికార్డులు తిరగరాయడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు, అభిమానులు. త్రివిక్రమ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం అభిమానులకు పెద్ద పండగలా ఉంది. ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.







