TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'అత్తారింటికి...' పైరసీ కష్టాలు తీరలేదు

Published on: Mon Sep 30, 2013 10:58AM

 

Attarintiki Daredi footage leak, pawan kalyan, Attarintiki Daredi collections, Attarintiki Daredi release

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాకు పైరసీ కష్టాలు ఇంకా తీరినట్టు కనిపించడం లేదు. రిలీజ్ కి ముందు పైరసీ బారిన పడిన ఈ సినిమా విడుదల తరువాత కూడా అదే సమస్యలా మారింది. ఒకవైపు 'అత్తారింటికి దారేది' సినిమా విడుదలై కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తుంటే..పైరసీ సీడులు అదే స్థాయిలో దొరుకుతున్నాయి. ఈ చిత్రం పైరసీ సిడీలు మరో సారి హైదరాబాద్ లో బయిటపడి అందరకీ షాక్ ఇచ్చింది. అప్పటడికీ ఈ చిత్ర ప్రొడక్షన్ టీం పైరసీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నా ఫలితం లేకుండాపోతోంది.

 

 

మరోవైపు 'అత్తారింటికి దారేది' సినిమాతో పవర్ స్టార్ మరోసారి తన పవర్ ని చూపించాడు. విడుదలైన మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'అత్తారింటికి దారేది' సినిమా తొలిరోజు కలెక్షన్ల లలో కొత్త రికార్డులు సృష్టించింది.ప రిస్థితి చూస్తుంటే సినిమా కలెక్షన్ల పరంగా కూడా రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.



త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.