'అత్తారింటికి దారేది'..నేను సింహం లాంటివాడిని: పవన్
Published on: Sat Jul 20, 2013 12:46PM

'అత్తారింటికి దారేది' ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనడైన స్టైల్లో స్పీచ్ నిచ్చి అభిమానులను అలరించారు. సాధారణంగా ఫంక్షన్ లలో తక్కువగా మాట్లాడే పవర్ స్టార్...'అత్తారింటికి దారేది' ఫంక్షన్ లో డైలాగు చెప్పడం విశేషం. ‘చూడప్పా సిద్దప్పా... నేను సింహం లాంటివాడిని... దానికి నాకు తేడా ఒక్కటే... అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతా అంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా ’ అంటూ తనదైన స్టైల్లో డైలాగ్ చెప్పారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను దర్శకత్వం వహించిన జాని సినిమా ప్లాపు తర్వాత కాస్త మూడౌట్లో ఉన్నాను. అదే సమయంలో త్రివిక్రమ్ వచ్చి కథ చెప్పారు. తొలిసారిగా ఆయన కథ చెబుతుంటే నిద్ర పోయాను. కానీ ఆయన ఏమాత్రం బాధ పడకుండా మళ్లీ జల్సా కథతో వచ్చారు. నేను మీలాంటి మనిషినే. నాకు బాధలు ఉంటాయి. జల్సా చేస్తున్న సమయంలో నాకు వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. అప్పుడు త్రివిక్రమ్ నాకు ఎంతో భరోసా ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతో ఓదార్పును ఇచ్చాయి. ఆయన నాకు ఎంత భరోసా ఇచ్చారు. అలాంటి వ్యక్తి దర్శకత్వంలో చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అని పవన్ కళ్యాన్ చెప్పారు.


