రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కత్తితో దాడి.. జూబ్లీహిల్స్‌లో కలకలం..
Published on: Wed Oct 27, 2021 12:14PM
వాళ్లిద్దరూ బంధువులు. ఇన్నాళ్లూ వారి మధ్య మంచి రిలేషనే ఉంది. తరుచూ కలుసుకోవడం.. వచ్చిపోవడం.. అంతా మనం-మనం రిలేషన్. కానీ, కొంతకాలంగా వారి మధ్య విభేదాలు.. తరుచూ గొడవలు.. అరుచుకోవడాలు.. తిట్టుకోవడాలు. కట్ చేస్తే.. కత్తితో దాడి. ఒక్కసారిగా షాక్. ఇంతకీ వారిమధ్య అసలేం జరిగింది? కత్తితో దాడి చేసుకునే వరకూ ఎందుకొచ్చింది? ఇంకేముందు డబ్బుల మేటరే. ఓ భూమి గొడవే వారి బంధుత్వాన్ని హత్యాయత్నం వరకూ తీసుకొచ్చింది. అసలేం జరిగిందంటే...
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి జరిగింది. రవీందర్‌రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. బేగంపేట ప్రాంతంలో విక్రయించిన స్థలానికి సంబంధించిన కమీషన్ సొమ్ము రూ.6 లక్షల వ్యవహారంలో ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్‌రెడ్డి.. రవీందర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఘటనలో రవీందర్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు దాడికి పాల్పడిన మోహన్‌రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.


