TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లేడీ యాంకర్ని గాయపరచిన మార్గాని అనుచరుడు!

Published on: Mon Oct 14, 2024 2:33PM

వైసీపీ నాయకులు అధికారం కోల్పోయినా రెచ్చిపోవడంలో ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అధికారంలో వున్నంతకాలం తెలుగుదేశం నాయకులు కార్యకర్తల మీద మాత్రమే కాకుండా, తమను ఎదిరించిన ప్రజల మీద కూడా దాడులు జరిపి జేబులు నింపుకున్న చరిత్ర వైసీపీ నాయకులకు వుంది. మాకు ఎవరూ ఎదురు చెప్పకూడదు.. ఎదురు చెబితే మా చేతిలో చిత్రహింసలకు గురవ్వాల్సిందే అనే ఆటవిక సిద్ధాంతాన్ని ఐదేళ్ళ పాలనా కాలంలో వైసీపీ నాయకులు ఆచరించారు. అయితే అధికారం కోల్పోయి నాలుగు నెలలు దాటుతున్నా వైసీపీ నాయకుల అరాచకాలు అంతం కాలేదు. ఇప్పటికీ వీళ్ళు చేస్తున్న దాడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే వున్నాయి. ఒకవైపు వైసీపీ నాయకులు రెచ్చిపోయి దాడులు చేస్తుంటే,  మరోవైపు వైసీపీ నాయకుడు జగన్ మా నాయకులు, కార్యకర్తలను కూటమి పార్టీల నాయకులు వేధిస్తున్నారు.. సాధిస్తున్నారు అంటూ మొత్తుకుంటున్నారు. మొత్తమ్మీద వైసీపీ నాయకుల వ్యవహారం చూస్తుంటే మొగుణ్ణి కొట్టి మొగసాలుకి ఎక్కినట్టుంది. తాజాగా వైసీపీ నాయకుల దాడి ఘటన మరొకటి జరిగింది. రాజమండ్రి సిటీ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మార్గని భారత్ అనుచరుడు, రాజమండ్రి కార్మిక నేత శ్రీనివాస్... విజయవాడకు చెందిన ఒక లేడీ యాంకర్ మీద దాడి చేశాడు. ఆడపిల్ల అని కూడా చూడకుండా యాంకర్ మీద మార్గాని అనుచరుడు శ్రీనివాస్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో యాంకర్ స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. విజయవాడకు చెందిన యాంకర్‌కు దాడి చేసిన శ్రీనివాస్‌కి మధ్య వున్న ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.  శ్రీనివాస్ చేతిలో గాయపడిన లేడీ యాంకర్.... శ్రీనివాస్ మీద రాజమండ్రి ప్రకాష్ నగర్‌లో కేసు నమోదు చేసినట్టు సమాచారం.