జబర్దస్త్ నరేష్ టీమ్‌పై దాడి

 

జబర్ధస్త్ షో ఫేమ్ నరేష్ టీమ్‌ పై దాడి జరిగింది. శ్రీకాకుళం చిన్నబరాటం వీధికి చెందిన యువకులు దాడి చేశారు. కళింగాంధ్రా ఉత్సవాల్లో పాల్గొనడానికి నరేష్ అండ్ టీమ్‌ హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లారు. అక్కడ ప్రోగ్రాం జరుగుతుండగా కొందరు స్థానిక యువకులు గ్రీన్ రూమ్‌లోకి తొంగి చూశారు. అక్కడే వున్న బౌన్సర్‌లు వాళ్లను అడ్డుకున్నారు. దీంతో వివాదం చెలరేగింది. వెంటనే నరేష్ బృందం అక్కడినుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అయ్యారు. అయితే మార్గమధ్యంలో అక్కడ గొడవపెట్టుకున్న యువకులు నరేష్ వాహనాలపై దాడికి పాల్పడ్డారు. కాగా, అక్కడున్నవారు దాడికి పాల్పడిన ఓ యువకుడిని పట్టుకొని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. దాడికి కారణమైన వాళ్లని అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ పోలీసులను అదేశించారు. మిగతావారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.