TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

భారతీయులపై దాడులకు ట్రంపే కారణం-సుష్మా

Published on: Sun Mar 5, 2017 1:59PM

అమెరికాలో భారతీయులపై దాడులకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే కారణం అన్నారు భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్. అమెరికాలో ప్రవాస భారతీయులపై వరుస దాడులపై ఆమె ఘాటుగా స్పందించారు. ట్రంప్ విద్వేషపూరిత వ్యాఖ్యలే అమెరికన్లను ఈ దాడులకు పురిగొల్పుతున్నాయన్నారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని కెంట్ నగరంలో శ్వేతజాతీయుడు జాతి వివక్షతో జరిపిన దాడిలో సిక్కు వ్యక్తి దీప్ రాయ్ తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సుష్మా దీప్ రాయ్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. అంతకు ముందు లాంకాషైర్‌లో దుండగుడి కాల్పుల్లో మరణించిన హర్నీష్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.