అమెరికాలో మరో భారతీయుడిపై కాల్పులు
Published on: Sun Mar 5, 2017 10:19AM

అమెరికాలో శ్రీనివాస్ కూచిభోట్ల, హర్నీష్ పటేల్‌ల దారుణహత్యల విషాదం నుంచి ప్రపంచం కోలుకోకముందే మరో భారతీయుడిపై కాల్పులు జరిపారు. శుక్రవారం రాత్రి వాషింగ్టన్ రాష్ట్రంలోని కెంట్ నగరంలో శ్వేతజాతీయుడు దీప్‌రాయ్ అనే ఒక సిక్కు వ్యక్తితో వాగ్వివాదానికి దిగాడు. మీ దేశానికి వెళ్లిపో అంటూ ఆయన ఇంటి బయటే కాల్పులకు పాల్పడ్డాడు. తీవ్రగాయాల పాలైన ఆయనను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గాలిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక సిక్కు సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


