దాడులతో దద్దరిల్లిన బలూచిస్థాన్
Published on: Sun Feb 1, 2026 7:11AM

బలూచిస్ధాన్ దాడులతో దద్దరిల్లింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రణాళికా బద్ధంగా పలు జిల్లాలలో జరిపిన దాడులలో పది మంది భద్రతా సిబ్బందితో పాటు 60మందికి పైగా బలూచిస్ధాన్ లిబరేన్ ఆర్మీ ఉగ్రవాదులు మరణించారు. నిషేధిత బలూచ్ లిబరేషన్ ఒకే సమయంలో వేర్వేరు నగరాల్లో ఉన్న సైనిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. బీఎల్ఏ ఉగ్రవాదులు క్వెట్టా, గ్వాదర్, నుష్కి వంటి నగరాల్లో కాల్పులు, పేలుళ్లు జరిపారు. ముఖ్యంగా క్వెట్టా పేలుళ్లు, కాల్పులు, దాడులతో దద్దరిల్లింది. సైన్యం, ఇంటెలిజెన్స్ ఆఫీసులపై ఆత్మాహుతి దాడులు చేశామని, కొన్ని చోట్ల సైనిక శిబిరాల్లోకి కూడా చొరబడ్డామని బీఎల్ఏ ప్రకటించింది. బీఎల్ఏ దాడులను పాకిస్థాన్ ప్రభుత్వం ధృవీకరించింది.
ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోందని, ఇప్పటికే 50 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేశామనీ పేర్కొంది. బలూచిస్థాన్ లో శాంతి భద్రతల పరిరక్షణకు సైనిక దళాలు రంగంలోకి దిగాయనీ పేర్కొంది. ఇలా ఉండగా తమ ఆపరేషన్ హెరోఫ్ రెండో దశలో భాగంగా ఈ దాడులకు పాల్పడిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ నుష్కీలోని కౌంటర్ టెర్రరిజం శాఖ ప్రధాన కార్యాలయాన్నీ, ఫ్రాంటియర్ కార్ప్స్ స్థావరాలను అధీనంలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఈ దాడుల కారణంగా పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్ అంతటా హై అలర్ట్ ప్రకటించింది.


