TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కుప్పంలో దాడుల సంస్కృతి.. వైకాపా నిర్వాకమే.. చంద్రబాబు!

Published on: Mon May 16, 2022 12:39PM

కుప్పంలో హోటల్ పై వైసీపీ కౌన్సిలర్లు చేసిన దాడిని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. కుప్పంలో ఎప్పుడూ లేని విధంగా దాడుల సంస్కృతిని వైసీపీ తీసుకురావడం దురదృష్టకరం అని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. భోజనం అయిపోయిందని హోటల్ సిబ్బంది చెప్పిన పాపానికి ఆ హోటల్ పై వైసీపీ ప్రజా ప్రతినిధులు దాడి చెయ్యడం దారుణం అని చంద్రబాబు ఖండించారు. 

హోటల్ లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేయడమే కాకుండా, మహిళలను వైసీపీ నేతలు బెదిరించడంపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి చంద్రబాబు డిమాండ్ చేశారు. హోటల్ నిర్వాహకులను చంపేస్తామని, హోటల్ తగలబెట్టేస్తాం అని వైసీపీ నేతలు అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని టీడీపీ చీఫ్ ప్రశ్నించారు.

కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా క్రిమినల్స్ యాక్టివిటీకి ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.