TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు..!

Published on: Wed Aug 12, 2026 2:44PM

 

రాజకీయ విభేదాల నేపథ్యంలో తనను కులం పేరుతో దూషించి, అవమానించారని ఆరోపిస్తూ ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 352తో పాటు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీస్) నిరోధక చట్టంలోని 3(1)(r), 3(1)(s) సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 1071/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్సూరాబాద్‌లోని మధురానగర్ కాలనీకి చెందిన బుద్ధ సత్యనారా యణ (52) గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు తెలి పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసిన తాను ప్రస్తుతం హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఎల్‌బీనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులతో తనకు సన్నిహిత రాజకీయ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రాజకీయ కార్య కలాపాల్లో భాగంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్య క్షుడు జక్కిడి శివాచరణ్‌ రెడ్డి, ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్‌రెడ్డితో కలిసి పని చేసినట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. అయితే అనంతరం రాజకీయ విభేదాలు ఏర్పడటంతో ప్రభాకర్‌రెడ్డి తనపై కక్ష పెంచుకున్నారని ఆరో పించారు. తాను ఎరుకల సామాజిక వర్గానికి చెందిన ఎస్టీ వ్యక్తిననే విషయం తెలిసినప్పటికీ, తనను కులం పేరుతో దూషించి అవమానించారని సత్య నారాయణ ఫిర్యాదులో ఆరోపించారు. 

ఫోన్‌లోనూ, ప్రత్యక్షంగానూ తనను, తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. కొన్ని వ్యాఖ్యలను సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసినట్లు ఆరోపించారు. తన కులం, కుటుంబ నేపథ్యం, వృత్తి, సామాజిక స్థితిగతులను ప్రస్తావిస్తూ అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించారని పేర్కొన్నారు. కులం పేరుతో తనను సామాజికంగా, రాజకీయంగా కించపరచడంతో పాటు ప్రజా, రాజకీయ జీవితంలో తన ఎదుగుదలను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నానని ఫిర్యా దులో తెలిపారు.

ఈ వ్యవహారం కారణంగా తాను, తన భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యామని సత్యనారాయణ పేర్కొ న్నారు. తన సామాజిక వర్గానికి చెందిన పలువురు కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ తనను ఫోన్‌లో సంప్రదిస్తున్నారని తెలిపారు. కులం పేరుతో తనను, తన కుటుంబ సభ్యులను, తన సామాజిక వర్గాన్ని దూషించి అవమానించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా కేసు నమోదు చేసిన ఎల్‌బీ నగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆరోపణలకు సంబంధించి సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తు న్నట్లు సమాచారం..

Atrocity case registered against Jakkidi Prabhakar Reddy, LB Nagar Constituency, Budda Satyanarayana, Jakkidi Shivacharan Reddy, Congress party, CM Revanth reddy