విత్ డ్రా లిమిట్ పెరిగిందోచ్..!
Published on: Mon Feb 20, 2017 11:41AM

ఖాతాదారులకు శుభవార్త...ఇవాళ్టీ నుంచి సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ వారానికి రూ.50 వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. జనవరి 30న జారీ చేసిన నోటిఫికేషన్లో దశల వారీగా నగదు విత్ డ్రాపై ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రకటించింది ఆర్‌బీఐ. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 20 నుంచి సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ వారానికి రూ.50లు విత్ డ్రా చేసుకోవచ్చు. పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు లభ్యత తక్కువగా ఉండటంతో ఆర్‌బీఐ విత్‌డ్రాలపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు నగదు లభ్యత పెరగడంతో కొద్ది కొద్దిగా ఆంక్షలను ఎత్తివేస్తున్నారు. మార్చి 13 నుంచి ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయనున్నారు.


