బొత్సకు జ్ఞానోదయం!
Published on: Wed Jun 29, 2022 4:51PM
ఆలీసంగానైనా ఆత్మశోధన చేసుకుని, తన తప్పును తెలుసుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయువాడు ధన్యుడు! ఇదేదో గొప్ప సూక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణకి కలిగిన జ్ఞానోదయం. అవును. చాలా రోజులుగా చెవిలో రక్తం కారేట్టు గోడు వినిపిస్తున్నా పట్టించుకోని మంత్రికి తన నియోజక వర్గంలోని వాస్తవాలు ఇప్పటికి తెలిసొచ్చాయి. ప్లీనరీలో మంత్రి తన చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ వర్గాల్లో విభేదాలు వున్నాయని ఎట్టకేలకు అంగీకరించారు. కానీ వారి మధ్య సయోధ్యకు ఆయన తీసుకునే చర్య లేమిటన్నది మాత్రం చెప్పలేదు.
అసలు విభేదాలంటూ లేకుండా వుండవు. కానీ వాటిని పెద్దవి చేసి బూతద్దంలో చూడటమే మంచిది కాద ని అంటున్నారు. నియోజకవర్గం స్థాయిలో శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని అవి పార్టీకి మంచిది కాదన్నా రు. ఇంకా ఇలా బోధించారు.. ఎల్లకాలం నేనే నాయకుడ్ని అనుకోవడం మంచిదికాదు. అదృష్టం ఉంటే ఎవ రైనా నాయకుడు అవ్వొచ్చు. సంక్షేమ పథకాలందించడంలో గ్రామ స్థాయి నాయకులు లంచాలడి పార్టీకి చేటు అన్నారు. పార్టీలో పెద్ద తలకాయల్ని ఆకట్టుకోవడానికి మరి నియోజకవర్గంలో చిన్నవారు అలాంటి పనులే చేపడతారు. ఎక్కడైనా ఇది అనాదిగా వున్నదే.
నియోజకవర్గంలో కొత్త నీటి బుడగలు వస్తున్నాయి.. అవి శాశ్వతం కాదు. పట్టించుకోవలసిన అవసరం లేదు. వయసులో చిన్నవాడివి నియోజకవర్గంపై అవగాహన లేకుండా మాట్లాడొద్దు. ఇది విమర్శ కాదు.. నేర్చుకో అంటూ టీడీపీ ఇన్‌చార్జ్ కిమిడి నాగార్జునకి కౌంటర్ ఇచ్చారు. మీ అమ్మగారు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఏమి అభివృద్ది చేసారో చెప్పు ముందు. నియంత రాజకీయాలు వద్దు. అందరూ కలసి నిర్ణయం తీసుకోండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవటం మానుకోమని పిలుపు నిచ్చారు.
డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడేం పాఠాలు చెప్పగలరు? 1998 డీఎస్సీ ఉద్యోగులను చూసి భయపడుతున్నాను.వయసులో పెద్దవారు కనుక బోధన చురుగ్గా చేపట్టడం కష్టమే. ఈ వయసులో వారు విద్యార్థులకు పాఠాలు ఏమి చెప్తారు? ఉద్యోగులకు మళ్లీ శిక్షణ నిర్వహిస్తామని అనడం బొత్సకు అసలు ఉపాధ్యాయులు, వారి సమస్యల గురించిన అవగాహన లేదనే అనాలి.


