వందేళ్ల నాటి కబ్జా.. చివరికి సొంత దారులకు దక్కిన బీచ్
Published on: Sat Jul 2, 2022 5:01PM
కబ్జాల పర్వం ఇండియాకే కాదు అగ్రరాజ్యానికి ఒక జాడ్యంగా ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆ కబ్జాలన్నీ జాతి వివక్ష కారణంగా నల్లజాతీయుల ఆస్తుల కబ్జా అధికంగా జరిగేది. జాతి వివక్ష నిర్మూళన దిశగా అగ్రరాజ్యం వేగంగా అడుగులు వేడయం ప్రారంభించడంతో నాడు కబ్జా చేసిన నల్లజాతీయుల ఆస్తులను వారికో వారి వారసులతో అప్పగించడం అక్కడ ఇప్పుడిప్పుడే మొదలౌతోంది.
ఆ కోవలోనే ఎప్పుడో వందేళ్ల కిందట నల్లజాతీయుల నుంచి లాక్కొన్న భూమిని ప్రభుత్వం వారి వారసులకు అప్పగించింది. వివరాల్లోకి వెళితే.. ఎప్పుడో 1912లో నల్లజాతీయుల కసం చార్ల్స్ బ్రూస్, విల్లా బ్రూస్ లు కాలిఫోర్నియాలో ఒక బీచ్ ను కొనుగోలు చేశారు. అయితే ఆ బీచ్ ను స్థానిక ప్రభుత్వం 1924లొ బలవంతంగా స్వాధీనం చేసుకుంది.
దానిపై ఇంత కాలంగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్న బ్రూస్ వారసులు ఎట్టకేలకు న్యాయపోరాటంలో విజయం సాధించారు. అప్పుడు ఆ బీచ్ ను జాతి వివక్షతోనే అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కౌంటీ కమిటీ తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పు గత మంగళవారం వెలువడింది. 1912లో బ్రూస్ సోదరులు ఆ బీచ్ కొన్నప్పుడు దాని విలువ 1225 డాలర్లు. ఇప్పుడు దాని మార్కెట్ విలువ 20 బిలియన్ డాలర్లు..భారత కరెన్సీలో దాని విలువ చెప్పాలంటే అక్షరాలా 158 కోట్ల రూపాయలు.


