భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. అంతరిక్షం నుంచి ఆస్ట్రోనాట్
Published on: Mon Aug 15, 2022 7:57AM
భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న శుభవేళ వినూత్న రీతితో ఓ వ్యోమగామి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇటాలియన్ ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫోరెట్టీ అంతరిక్షం నుంచి భారత ప్రజలకు ఓ వీడియో సందేశం ద్వారా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఆ వీడియోలో ఆమె భారత్ కు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఇస్రో చేపడుతున్న గగన్ యాన్ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ వీడియోను ఇస్రో ట్విటర్‌లో షేర్ చేసింది.


