అసెంబ్లీలో గందరగోళం..వాయిదా
Published on: Mon Feb 27, 2012 11:11AM
హైదరా
బాద్ : అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోనే అరగంట వాయిదా పడింది. మద్యం సిండికేట్ వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో అసెంబ్లీలో సోమవారం గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. సభా ప్రారంభం కాగానే విపక్షాల వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులంతా స్పీకర్ పోడియం ముందుకు దూసుకొచ్చారు. మద్యం సిండికేట్‌పై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆ అంశం సభలో సుదీర్ఘ చర్చ జరిగిందని స్పీకర్ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే విపక్ష సభ్యులు మాత్రం లిక్కర్ సిండికేట్ వ్యవహారాలపై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో సభను స్పీకర్ అరగంట వాయిదా వేశారు.


