TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రభుత్వానికి కవిత హెచ్చరిక

Published on: Mon Feb 13, 2012 8:28AM

హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో వెంటనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, దీనిపై నిర్ణయం తీసుకునేందుకు మార్చి నాలుగో తేది వరకు సమయం ఇస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం డిమాండ్ చేశారు. అప్పటికీ ఎలాంటి నిర్ణయం ప్రకటించకుంటే మార్చి 4వ తేదిన జాగృతి ఆధ్వర్యంలో ఐదువేల మందితో ఇందిరా పార్కు వద్ద ఇరవై నాలుగు గంటల సామూహిక నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. సోమవారం నుండి అసెంబ్లీ ప్రారంభమవుతున్న దృష్ట్యా ప్రభుత్వం బిఏసిలో ఈ అంశంపై చర్చించి త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. మూడున్నర కోట్ల రూపాయలు పెట్టి అసెంబ్లీని తీర్చిదిద్దిన ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహం పెట్టడంపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఆందోళన విషయంలో తమతో కలిసి వచ్చే వారిని కలుపుకొని వెళతామన్నారు. కాగా అసెంబ్లీ ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహం పెట్టాలన్న జాగృతి డిమాండు పైన తాము చర్చించి మద్దతిస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు.