13నుంచి సభ మొదలు..17న బడ్జెట్
Published on: Tue Feb 7, 2012 8:37AM
హై
దరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు గవర్నర్ నరసింహన్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజు మండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. తొలిరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈనెల 17న శాసనసభలో 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెడతారు.


