TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ప్రజలకు ఎప్పుడో ద్రోహం చేసిండు:మోత్కుపల్లి

Published on: Thu Jan 5, 2012 2:05PM

హైదరాబాద్: అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగ పాఠానికి చెందిన టేపులను కొన్నింటిని మీడియాకు చూపిస్తూ కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఎప్పుడో ద్రోహం చేసిండు అని తెదేపా నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు మరోసారి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎలా మోసం చేసిండో  చూడండి అంటూ వివరించారు.ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కొడుకు పేరును రామారావు పేరు పెట్టి ఎన్టీర్ మెప్పు పొందిన కేసీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తుండని మండిపడ్డారు.అసలు కేసీఆర్ తాగేది తెలంగాణ రక్తం పాడేది సీమాంధ్ర పాట అనీ, సకలజనుల సమ్మె తర్వాత పిల్లిలా ఢిల్లీ వెళ్లి పోలవరం టెండర్లు దక్కించుకుని ప్రధానితో తెలంగాణ రాదని చెప్పించిండు అని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని విద్యావంతులు గమనించాలె అని చెప్పారు.ముప్పూటలా మందుగొట్టే ఇటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే మనం ఎన్ని జన్మలెత్తినా తెలంగాణ రాదని మోత్కుపల్లి విమర్శించారు. తెలంగాణలో జై తెలంగాణ.. ఢిల్లీలో నై తెలంగాణా అని కేసీఆర్ దొంగనాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.