TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజుకున్న రాయదుర్గం

Published on: Mon May 21, 2012 1:00PM

అనంతపురం జిల్లా రాయదుర్గంలో రెండుపార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పోటీలో ఉన్న ప్రధానపార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య చాలాకాలంగా యుద్ధవాతావరణం నెలకొంది. అది ఎన్నికల్లో మరీ ఎక్కువై చివరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి చిరిగిన బట్టలతో రోడ్డుపై తిరిగే పరిస్థితి కల్పించింది. ఓ పథకం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి అనుచరులు దాడి చేశారని దీపక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తమను విందుకు పిలిచి వల్లేపల్లి (వేణుగోపాల్ రెడ్డి స్వగ్రామం) గ్రామస్థులు సుమారు రెండొందల మంది మూకుమ్మడి దాడి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

తనతో పాటు మొత్తం 11మంది కార్యకర్తలు గాయపడ్డారని తెలిపారు. ప్రధానంగా వేణుగోపాల్ రెడ్డి కుమారుడు అజయ్ కుమార్ రెడ్డి, సోదరులు శివారెడ్డి, కృష్ణారెడ్డి మరో 200మంది దాడిలో పాల్గొన్నారని దీపక్ రెడ్డి పోలీసులకు తెలిపారు. తన కార్యకర్తలు ఐదుగురు కనిపించటం లేదన్న ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని దీపక్ రెడ్డి వివరించారు. నామినేషన్లకు ముందుగానే ప్రారంభమైన ఈ వివాదాలు చివరికి ఏ స్థాయికి చేరుకుంటాయెన్ని ఓటర్లు భయపడుతున్నారు. అందుకే ఎవరికీ ఓటేస్తారో అభ్యర్థులకు అర్థం కాకుండా నడుచుకునేందుకు ఓటర్లూ సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులనూ తాము నమ్మేది లేదని ఓ ఓటరు (పేరు రాయోద్దన్నారు) 'తెలుగువన్.కామ్' కు తెలిపారు. ఫ్యాక్షనిజం పడగనీడలో బతుకుత్న్న తమకు ఇది అలవాటేనని ఆయన స్పష్టం చేశారు.