TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వాహనదారులకు, మందుబాబులకు పండగే..

Published on: Fri Feb 12, 2021 3:34PM

మన దేశంలో గత కొంత కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ స్పీడ్ తో ఆకాశాన్నంటుతున్నాయి. వీటి స్పీడ్ గమనిస్తే అతి త్వరలో సెంచరీ కొడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 

త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్ననేపధ్యంలో అసోం ప్రభుత్వం తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ పెట్రోలుపై లీటరుకు 5 రూపాయలు తగ్గిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇదే సమయంలో మద్యంపై కూడా టాక్స్ ను 25 శాతం తగ్గించినట్లు అస్సాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన కొత్త రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిస్వాస్ అసెంబ్లీలో ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌, మద్యంపై అదనపు సెస్ విధించామని.. అయితే ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గడంతో పాటు రోగుల సంఖ్య కూడా బాగా తగ్గిందని బిశ్వాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ధరలతో పాటు సుంకాన్ని తగ్గించినట్లు అయన చెప్పారు. అసోం ప్రభుత్వ తాజా నిర్ణయంతో లక్షలాది మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్ధిక మంత్రి తెలిపారు. 

ఇది ఇలా ఉండగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఇది కేవలం ఒక గిమ్మిక్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసోంలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి-ఏప్రిల్‌ మధ్యలో జరగనున్నాయి, దీంతో అక్కడి బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు భారీగా కసరత్తు చేస్తోంది.