TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి ఆయుధాలు

Published on: Wed May 28, 2025 8:29PM

 

అస్సాం ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు ఎక్కువ ప్రాంతాలో స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయంచింది. ముస్లింలు ఎక్కువ ప్రాంతాల్లో అలాగే బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాల్లో నివసించే స్థానిక, ఆదివాసీ ప్రజలకు భద్రత కోసం గన్ లైసెన్సులు  ఇవ్వాలని  సీఎం హిమంత బిశ్వ శర్మ  కీలక ప్రకటన జారీ చేశారు. 

గౌహతిలోని లోక్ సేవా భవన్‌లో జరిగిన మంత్రి వర్గ మీటింగ్ జరిగిన తర్వాత శర్మ మాట్లాడుతూ.. నాగావ్‌లోని ఢింగ్, రూపోహి, దక్షిణ సల్మారా, గౌహతిలోని హాటిగావ్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఈ లైసెన్సులు ఇస్తామని చెప్పారు. ఈ ప్రాంతాలను ప్రభుత్వమే గుర్తిస్తుందని, దరఖాస్తుదారులు నేర చరిత్ర లేకుండా ఉండాలని షరతు విధించారు. అస్సాం అల్లర్లు సమయం నుంచి స్థానికులు ఈ డిమాండ్ చేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నరు.