కాశ్మీర్ వేర్పాటువాద నేత అరెస్ట్...
Published on: Thu Apr 27, 2017 12:24PM

కాశ్మీర్ లో వేర్పాటు వాదులు చేసే ఆరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ కశ్మీర్ వేర్పాటువాద నేతను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. దుక్‌త్రన్-ఇ-మిల్లత్ అనే ఇస్లామిక్ వేర్పాటువాద సంస్థ నేత ఆసియా అంద్రాబీని రాత్రి శ్రీనగర్‌లో అరెస్టు చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కశ్మీరీ లోయ ప్రజలను ఆంద్రాబీ రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఇటీవల భారత బలగాలు చాలా మంది మిలిటెంట్లను అరెస్టు చేయగా..ఆంద్రాబీ ప్రసంగాలు వినడం వల్లే తాము అలా తయారైనట్లు వాళ్లు చెబుతున్నారు.


